బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్ర పతి రామ్‌నాధ్ కోవింద్, అమితాబ్‌కు ఫాల్కే పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, అమితాబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేని సందర్భమని అమితాబ్ పేర్కొన్నారు.
భారతదేశం గర్వించదగిన నటుల్లో అమితాబ్ ఒకరు. 5 దశాబ్దాల నట జీవితంలో 190కి పైగా సినిమాల్లో నటించారు. సాంఘిక, చారిత్రక చిత్రాల్లో తనదైన నటనతో చెరిగిపోని ముద్ర వేశారు. యాంగ్రీ హీరోగా, రెబల్‌గా, లవర్ బోయ్‌గా రకరకాల పాత్రల్లో అలరించారు. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినీరంగంలో చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. రెండు తరాల ప్రేక్షకులను బిగ్ బీ అట్రాక్ట్ చేసి, స్ఫూర్తిగా నిలిచారని కేంద్రం కొనియాడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com