సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు..

సికింద్రాబాద్ ఆర్‌కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీతో పాటు బీఈడీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్దులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి గడువులోగా దరఖాస్తు అందజేయాలి.
వివరాలు.. మొత్తం ఖాళీలు: 46.. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)
సబ్జెక్టుల వారీగా ఖాళీలు..
ఇంగ్లీష్ : 23.. హిందీ : 02.. సంస్కృతం : 02.. హిస్టరీ : 01.. పొలిటికల్ సైన్స్ : 01.. మ్యాథ్స్ : 02.. ఫిజిక్స్ : 01.. కెమిస్ట్రీ : 01.. బయాలజీ : 01.. సైకాలజీ : 01.. కంప్యూటర్ సైన్స్ : 01.. ఫిజికల్ ఎడ్యుకేషన్ : 03.. సైన్స్ : 01, ఆర్ట్స్ & క్రాప్ట్స్ : 02.. మ్యూజిక్ (వెస్టర్న్) : 02, డ్యాన్స్ : 01.. స్పెషల్ ఎడ్యుకేటర్ : 01
అర్హత: 50% మార్కులతో బీఈడీ, పీజీ ఉత్తీర్ణత.. వయసు: 01.04.2020 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు Army Public School, RK Puram పేరిట సికింద్రాబాద్‌లో చెల్లుబాటు అయ్యేలా రూ.100 డిడి తీయాలి. దరఖాస్తుతో పాటు డిడిని కూడా జత చేసి పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ : 05.1.2020.. చిరునామా: Army Public School, RK Puram, Tirumalghery, Secunderabad, Telangana-500056.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com