ప్రధాని మోదీ అధికారిక నివాసంలో మంటలు

ప్రధాని మోదీ అధికారిక నివాసంలో మంటలు
X

fir

ప్రధాని మోదీ అధికారిక నివాసంలో మంటలు చెలరేగాయి. సోమవారం రాత్రి 7 గంటలకు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని మోడీ నివాసంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. 9 మంది ఫైర్‌మెన్‌లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న అంబులెన్సులు కూడా ప్రధాని నివాసానికి వచ్చాయి. మంటలు ప్రధానమంత్రి నివాసంలోని విద్యుత్ నియంత్రణ గది నుంచి వచ్చినట్లు తెలిసింది. అప్రమత్తమైన అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ప్రధాని నివాసానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. మంటలు తగ్గాయని పిఎంఓ ట్వీట్ చేసింది.

Tags

Next Story