రాజధాని రైతులు దొంగల్లా కనిపిస్తున్నారా? : చంద్రబాబు

రాజధాని రైతులు దొంగల్లా కనిపిస్తున్నారా? : చంద్రబాబు

chandrababu

రైతుల అరెస్టుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వానికి రాజధాని రైతులు దొంగల్లా కనిపిస్తున్నారనా అని ప్రశ్నించారు. గుంటూరు ‌ జైలుకు వచ్చిన చంద్రబాబు.. రైతుల్ని పరామర్శించారు. భూములు కోల్పోయి ఆందోళన చేస్తున్నవారిపై హత్యాయత్నం కేసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధానికి భూములిచ్చిన రైతుల్ని జైళ్లలో పెట్టడంపై చంద్రబాబు మండిపడ్డారు. నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసు దాడులు హేయమన్నారు. దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులు చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేఎశారు. జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన లేదని.. అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి మరీ రైతులను అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా పూటకో పోలీస్‌స్టేషన్‌కు మారుస్తూ వేదించడంపై చంద్రబాబు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story