జైల్లో ఉన్న రైతులను పరామర్శించిన చంద్రబాబు

జైల్లో ఉన్న రైతులను పరామర్శించిన చంద్రబాబు

chandrababu

అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతుల్ని అరెస్ట్ చేయడం దారుణం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గుంటూరు సబ్ జైల్లో ఉన్న రైతులను ఆయన పరామర్శించారు. రాత్రిపూట గ్రామంలోకి వెళ్లి అరెస్టులు చేయడమే కాకుండా ఇష్టానుసారంగా కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దొంగలను తిప్పినట్లు తిప్పుతారా అంటూ మండిపడ్డారు. అరెస్టులతో బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు..

వైసీపీ ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూస్తోందని ఆరోపించారు చంద్రబాబు. ఓ పక్క డబ్బులు లేవని చెబుతూనే రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నించారు.. GN రావు కమిటీ పేరు చెప్పి...మంత్రులంతా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు...మహిళలు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తుంటే పెయిడ్

ఆర్టిస్టులంటారా అని అగ్రహం వ్యక్తం చేశారు.

Read MoreRead Less
Next Story