ముఖ్యమంత్రి జగన్ అందర్ని ఫూల్ చేశారు : సీపీఐ రామకృష్ణ

రాజధాని విషయంలో ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందర్ని ఫూల్ చేశారన్నారు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ. మూడు రాజధానులు అనడంలో అర్ధంపర్థం లేదన్నారు. ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ ఎవరిని ఫూల్ చేయడానికని ఆయన ప్రశ్నించారు. జగన్, విజయసాయి రెడ్డీలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. వాపక్షాల ఆధ్వర్యంలో రాజధాని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు సీపీఐ రామకృష్ణ.
Next Story