ఐఎంఎస్‌ కుంభకోణంలో నిందితుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఐఎంఎస్‌ కుంభకోణంలో నిందితుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X

ism

బీమా వైద్య సేవల కుంభకోణంలో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిందితులు కూడబెట్టిన ఆస్తులను గుట్టు రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే కేసులు నమోదు చేసిన అధికారులు, నిందితులు దాచిపెట్టిన అస్తుల వివరాలను రాబట్టేందుకు త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నారు. అక్రమార్జనలో కొంత సొమ్మును ఉన్నతాధికారులకు పంచిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వాటిపై ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఐదేళ్ల కాలంలో ఐఎంఎస్‌ ద్వారా వెయ్యి కోట్లు ఖర్చు చేయగా అందులో రూ.200 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత కొల్లగొట్టారన్న దానిపై వివరాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా నిందితులు దోచుకున్న డబ్బుతో బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ప్రాధమికంగా గుర్తించారు.

దేవికారాణి దాదాపు రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక పక్క కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తుండగానే నిందితులు దోచుకున్న డబ్బును ఎటువైపు మళ్లించారో తెలుసుకుని వాటి ద్వారా సమకూర్చుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. వారిపై మనీ ల్యాండరింగ్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈమేరకు ఈడీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. విచారణలో భాగంగా తొలుత దేవికారాణిని అదుపులోకి తీసుకోనున్నారు ఈడీ అధికారులు.

Tags

Next Story