67 ఏళ్ల వయసులో ఐ లవ్యూ అంటూ ఆమెను..

67 ఏళ్ల వయసులో ఐ లవ్యూ అంటూ ఆమెను..

marriage

ఆమెను 30 ఏళ్ల క్రితమే చూశాను. అప్పుడే లవ్‌లో పడిపోయాను. ఈ విషయం నా పిల్లలకు చెబితే చెప్పిచ్చుకు కొడతారేమో అని నా ప్రేమని నా గుండెల్లోనే దాచుకున్నాను. విధి విచిత్రం ఇన్నాళ్లకు మేమిద్దరం ఒక్కటయ్యాం.. ఐ అయాం వెరీ హ్యాపీ టుడే అంటూ పళ్లూడిన ఆ తాతగారు పడుచుదనంలో రెక్కలు తొడిగిన యువకుడిలా ముసి ముసిగా నవ్వుకుంటున్నారు.

కేరళ త్రిస్సూర్‌కు చెందిన లక్ష్మి అమ్మాళ్ భర్త వద్ద అసిస్టెంట్‌గా పనిచేసేవారు కొచ్చనియాన్. 21 ఏళ క్రితం అమ్మాళ్ భర్త చనిపోయారు. దీంతో అమ్మాళ్ బంధువులతో కలిసి జీవించేది. వయసు మీద పడడంతో 65 ఏళ్ల అమ్మాళ్‌ని వృద్ధాశ్ర మంలో చేర్పించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆమె వయసు వారే ఉంటారు కాలక్షేపం అవుతుందని. అయితే అనుకోకుండా అదే ఆశ్రమానికి రెండు నెలల క్రితం కొచ్చనియాన్ కూడా వచ్చి ఉంటున్నారు. పాత పరిచయం చిగురులు తొడిగింది. ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

అదే విషయాన్ని ఆశ్రమంలోని వారికి చెప్పడంతో పెళ్లి ఏర్పాట్లు చేశారు. వీరి వివాహ వేడుక గురించి తెలుసుకున్న కేరళ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్‌ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన చిత్రాలు, వీడియో వైరల్ కావడంతో ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read MoreRead Less
Next Story