మద్యం మత్తులో కన్నతల్లిని, కట్టున్న భార్యను..

మద్యం మత్తులో కన్నతల్లిని, కట్టున్న భార్యను కడతేర్చాలనుకున్నాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన కడపజిల్లా జమ్మలమడుగులో జరిగింది. తాగుడికి బానిసైన ఆటో డ్రైవర్ నాగరాజు.. ఆదివారం రాత్రి భార్యతో గొడవకు దిగాడు. ఆమె తలపై ఇటుకరాయితో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం.. ఆమె నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన నాగరాజు.. భార్యపై మళ్లీ దాడికి దిగాడు. ఆమె తప్పించుకోవడంతో.. అక్కడే ఉన్న కన్నతల్లిపై కత్తితో దాడి చేశాడు. తల్లి రెండు కాళ్లు నరికాడు. దీంతో.. స్థానికులు ఆమెను జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం పొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.
Next Story