ఇండియన్ నేవీ అలర్ట్.. సిబ్బందిపై ఆంక్షలు

ఇండియన్ నేవీ అలర్ట్.. సిబ్బందిపై ఆంక్షలు

navy

శత్రుదేశాలకు కీలక సమాచారాన్ని అందిస్తోన్న ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్ట్‌తో భారతనౌకదళం అప్రమత్తమైంది. ఆన్‌లైన్‌లో ముప్పు పొంచి ఉండటంతో.. సోషల్‌ మీడియా, స్మార్ట్‌ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌లు, నెట్‌వర్కింగ్‌, బ్లాగింగ్‌, ఇ-కామర్స్‌ వంటి వెబ్‌సైట్లు తమ సిబ్బంది ఉపయోగించకుండా నిషేధించింది. నేవీ బేస్‌లు, డాక్‌యార్డ్‌లు, యుద్ధ నౌకల్లో స్మార్ట్‌ఫోన్‌లు కూడా వినియోగించరాదని ఆదేశించింది. సిబ్బంది హనీట్రాప్‌లో పడకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది నౌకాదళం.

పాకిస్థాన్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న ఏడుగురు నేవి అధికారుల్ని విశాఖలో అరెస్ట్‌ చేశారు. ఈ స్పై రాకెట్‌ను ఏపీ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఇటీవల బయటపెట్టింది. కేంద్ర, నౌకాదళ నిఘా విభాగాల సహకారంతో ‘ఆపరేషన్ డాల్ఫిన్‌ నోస్‌’ పేరుతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. హవాలా డబ్బు కోసం.. దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారు ఏడుగురు నేవీ ఉద్యోగులు. వీరితో పాటు ఓ హవాలా ఆపరేటర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన నేవీ.. సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్లను నిషేధించింది.

Tags

Next Story