ఎన్ని ఆందోళనలు చేసినా సీఏఏను అమలు చేస్తాం: కిషన్ రెడ్డి

ఎన్ని ఆందోళనలు చేసినా సీఏఏను అమలు చేసి తీరుతామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సీఏఏ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీజేపీ సభ నిర్వహించింది. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. సర్కారు ఆస్తులను ధ్వంసం చేసిన వారి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.
మజ్లిస్ ఎజెండాను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. కేసీఆర్, అసద్‌లు సీఏఏ, ఎన్నార్సీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నివసించే ఆంధ్రులను గుర్తించేందుకే కేసీఆర్ సమగ్ర సర్వేను గతంలో నిర్వహించారని లక్ష్మణ్ ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com