30 Dec 2019 10:40 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఒంగోలు ప్రజాచైతన్య...

ఒంగోలు ప్రజాచైతన్య యాత్రలో పాల్గొన్న ఎంపీ జీవీఎల్

ఒంగోలు ప్రజాచైతన్య యాత్రలో పాల్గొన్న ఎంపీ జీవీఎల్
X

mp-gvl

CAA చట్టాన్ని సమర్ధిస్తూ... దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నామని.. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రజాచైతన్య యాత్రలో జీవీఎల్ పాల్గొన్నారు. ఏకేవీకే కళాశాల నుంచి జరిగిన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. CAAకు వ్యతిరేకంగా దేశంలో కొన్నిపార్టీలు అరాచకాలు సృష్టిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల కుటుంబాలకు బీజేపీ కార్యకర్తలు వెళ్లి వివరిస్తారని జీవీఎల్ పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా... నెరవేరని ఆకాంక్షను పూర్తి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు జీవీఎల్‌.

Next Story