ఢిల్లీలో మిస్టరీగా మారిన తెలుగు వైద్యుల అదృశ్యం

ఢిల్లీలో తెలుగు వైద్యుల అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ నెల 25న డాక్టర్‌ హిమబిందు, డాక్టర్‌ దిలీప్‌ సత్య అదృశ్యమయ్యారు. హిమబిందు భర్త శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్‌, హిమబిందు, శ్రీధర్‌ ముగ్గురు కర్నూల్‌ మెడికల్‌ కళాశాలలో కలిసి చదువుకున్నారు. ఈ నెల 24న పుదుచ్చేరిలోఇంటర్వ్యూకి వెళ్లి 25న తిరిగి వస్తుండగా ఢిల్లీలోని శ్రీధర్‌ దంపతుల ఇంట్లో ఆగారు దిలీప్. ఉదయం 11 గంటల సమయంలో చర్చికి వెళ్తున్నానని చెప్పి హిమబిందు, దిలీప్‌ బయటికి వెళ్లారు. కాసేపటి తరువాత ఇద్దరి మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో బిందు భర్త శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు రోజులైన ఆచూకీ లభ్యం కాకపోవడంపై శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story