కృష్ణా జిల్లాలో ఊపందుకున్న సేవ్ అమరావతి ఉద్యమం.. భారీ సంఖ్యలో మహిళల ర్యాలీ

కృష్ణా జిల్లాలో సేవ్ అమరావతి ఉద్యమం ఊపందుకుంది. విజయవాడలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫన్‌టైమ్స్ రోడ్‌లో సాయంత్రం ఆరున్నర గంటలకు.. ఆ చుట్టుపక్కల కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ మొదలుపెట్టారు. ర్యాలీ సమయంలో లైట్లు ఆర్పేసి నిరసన తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్నా.. పోలీసులు ఎంటరయ్యారు. సుమారు పాతిక మందిని అరెస్ట్ చేశారు. పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై మహిళలు మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అంటున్నారు.
Next Story