రూ.5 లక్షల కోసం రష్మీ..

రూ.5 లక్షల కోసం రష్మీ..

rashmi

బుల్లితెరపై పాపులరైన జంట ఎవరంటే టక్కున గుర్తొచ్చేది రష్మీ, సుధీర్‌లు. వీరిద్దరి మద్య నిజంగా ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. స్క్రీన్ మీద మాత్రం బోలెడు ప్రేమని కురిపిస్తారు. వాళ్లిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. నిజంగా ఒకరి కోసం ఒకరు చచ్చిపోయేంత ప్రేమ ఉందేమో అని అనిపిస్తుంది. అందుకే ఆమెనే హీరోయిన్‌గా, అతడినే హీరోగా పెట్టి సినిమా తీద్దామనుకున్నారు దర్శకులు. కానీ ఆ సినిమాలో నటించాలంటే రష్మీ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ రూ.40 లక్షలు.. కానీ నిర్మాతలు రూ.35 లక్షలు ఇస్తామన్నారు. కాదు.. కూడదు అంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకుంది రష్మీ గౌతమ్.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు... రష్మీ జీవితంలో ఇది దురదృష్టకరమైన సంఘటన. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఆ జంటను ఎంతో ఇష్టపడతారు. 'సాప్ట్‌వేర్ సుధీర్' సినిమాలో నటించడానికి రష్మీ ఒప్పుకుని ఉంటే సినిమా సూపర్ హిట్టయ్యేది. ఇప్పటి వరకు రష్మీ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. కారణం.. అందరూ ఆమెలోని గ్లామర్‌ని చూపించడానికే వాడుకున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌కు స్కోప్ ఉన్న పాత్ర. అందులో ఆమె నటించి ఉంటే తరువాతి సినిమాకు కోటి రూపాయలు ఇచ్చే వాళ్లేమో. సాప్ట్‌వేర్ సుధీర్‌కి నోచెప్పి రష్మీ చాలా పెద్ద పొరపాటు చేసింది. ఓ డైలాగ్ చెప్పి నలుగురి చేతా శెభాష్ అనిపించుకోవాలి కానీ.. స్కిన్ షో చేసి పాపులారిటీ సంపాదించుకోకూడదు అని అన్నారు. మరి రష్మీ కూడా ఆ సినిమా ఆఫర్‌ని మిస్ చేసుకున్నందుకు అంతే పీలయ్యిందో.. లేక డైరక్టర్ మాటలకు నొచ్చుకుందో. ఏదేమైనా ఇలాంటివి ఇండస్ట్రీలో కామన్.

Read MoreRead Less
Next Story