ఘోర ప్రమాదం.. అదుపు తప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు
By - TV5 Telugu |30 Dec 2019 5:03 AM GMT
ఉత్తర భారతంలో పొగమంచు ఉసురు తీస్తోంది. గ్రేటర్‌నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. దట్టంగా అలముకున్న పొగమంచుతో ఓ కారు అదుపు తప్పి కెనాల్‌లో పడిపోయింది. ఈప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పొగమంచు దట్టంగా అలముకోవడం.. వెలుతురు తగ్గిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో కారులో మొత్తం 11 మంది ఉన్నట్లు చెప్పారు. కారులో ప్రయాణించిన వారంతా ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com