రెండు రోజులుగా గాలిస్తున్నా.. లభించని కాల్ మనీ బాధితుడి ఆచూకీ

కాల్‌మనీ వేధింపులు భరించలేక రెండ్రోజుల క్రితం విజయవాడ మద్రాస్ కాలువలో ప్రేమ్ అనే వ్యక్తి దూకాడు. ప్రేమ్ కోసం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెండ్రోజులుగా గాలిస్తున్నా.. ఇప్పటి వరకు అతని ఆచూకి లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. కాల్‌మనీ వేధింపులకు పాల్పడిన రంగారావుతో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వడ్డీ రాక్షసుల వేధింపులకు బరించలేక ప్రేమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాలుగు లక్షల అప్పుకు ఇప్పటివరకూ 16 లక్షలు కట్టాడు. ఇంకా డబ్బు ఇవ్వాలంటూ.. కాల్‌మనీ వ్యాపారులు కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ ఒత్తిడి చేస్తున్నారంటూ బాధితుడు సెల్ఫీ వీడియో తీశాడు. వీరి వేధింపులపై గతంలోనే పటమట పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ప్రేమ్ కన్నీరు పెట్టాడు. పైగా స్టేషన్‌లో ఆ నలుగురూ తనను కులం పేరుతో దూషించారంటూ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ప్రేమ్ మరణంతో అతని కుటుంబం షాక్‌లో ఉంది. కాల్‌మనీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అతని భార్య డిమాండ్ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com