మద్దాలి గిరి కూడా వంశీ బాటలోనే వెళ్తారా?

మద్దాలి గిరి కూడా వంశీ బాటలోనే వెళ్తారా?

Maddali_GiridharRao_Vellampalli1

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు టీడీపీకి చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి. రాజధాని విషయంలోనూ సీఎం జగన్‌కు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు.మంత్రి వెల్లంపల్లితో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు మద్దాలి గిరి. అయితే నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎంను కలిసినట్లు చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని మద్దాలి గిరి విమర్శించారు..

ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.. గతంలోనూ ఇదే విధంగా సీఎంను కలిశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఈ నేపథ్యంలో మద్దాల గిరి కూడా వంశీ బాటలోనే వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story