అది హైపవర్ కమిటీ కాదు.. హై చీటింగ్ కమిటీ : టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ.. స్వేచ్ఛగా నివేదిక ఇవ్వగలదా అని ప్రశ్నించారు... ఎంపీ కేశినేని నాని... ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అది హైపవర్ కమిటీ కాదని.. హై చీటింగ్ కమిటీ అని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలోనే జగన్ కన్ను విశాఖపై పడిందని... అందుకే ఇప్పుడు రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాజధాని కోసం శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై కేసులు పెట్టడం తగదన్నారు టీడీపీ నేతలు. రాజధాని కోసం అన్నిపార్టీలు JACగా ఏర్పడలాంటున్నారు టీడీపీ నేతలు.
Next Story