తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు

cold

తెలుగు రాష్ట్రాలపై చలి ప్రతాపాన్ని చూపిస్తోంది.. రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి.. తెలంగాణలో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.. ఉత్తర భారతం నుంచి చలిగాలులు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఇప్పటి వరకు తూర్పు దిశ నుంచి తేమ గాలులు వచ్చాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి.. ఆదిలాబాద్‌ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. చలి ఒక్కసారిగా పెరగడంతో జనం వణికిపోతున్నారు.. ఉదయం పది గంటలు దాటినా ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నారు. మధ్యాహ్నం కొంత మేర ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ సాయంత్రానికే మళ్లీ వాతావరణం చల్లగా మారిపోతోంది.

భీమపూర్‌లో ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా తంసిలో 6.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా సిర్పూర్‌లో 6.6 డిగ్రీలు, జైనాడ్‌, బేలాలలో 7.1 డిగ్రీలు, తలమడుగులో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. వచ్చే నెలలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సోమవారం, మంగళవారం ఆదిలాబాద్‌, కొమురం భీం, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల జిల్లాలో 9.5 డిగ్రీలు, వికారాబాద్‌లో 10.6, పెద్దపల్లి, కుమురం భీం, ఆసిఫాబాద్‌లో 12, వరంగల్‌లో 12.5, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story