మాజీ ఎంపీ.. టీడీపీ నేత రాయపాటి నివాసం, కంపెనీల్లో సీబీఐ సోదాలు

మాజీ ఎంపీ.. టీడీపీ నేత రాయపాటి నివాసం, కంపెనీల్లో సీబీఐ సోదాలు

rayapati

మాజీ ఎంపీ.. టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు నివాసం, కంపెనీల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఏక కాలంలో హైదరాబాద్‌, గుంటూరు, బెంగళూర్‌, తమిళనాడుల్లో తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

తెల్లవారుజామునుంచి గుంటూరులోని రాయపాటి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ 300 కోట్ల రూపాయల బ్యాంక్‌ నుంచి రుణంగా తీసుకుంది. అయితే తీసుకున్న రుణం చెల్లించలేదని రాయపాటిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాయపాటి కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా సోదాలు కొనసాగుతున్నాయి.

Tags

Next Story