ప్రతి భక్తుడికి ఉచితంగా వెంకన్న లడ్డు

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న భక్తులకు న్యూ ఇయర్ సందర్భంగా టీటీడీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించనుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు 20 రూపాయలకు రెండు లడ్డూలు, 50కు మరో రెండు లడ్డూలను టీటీడీ రాయితీపై ఇస్తోంది. అలాగే నడకమార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పొందే భక్తులకు ఉచితంగా ఒక లడ్డూ, 20 రూపాయలకు రెండు, 50కి రెండు.. మొత్తం 5 లడ్డూలను రాయితీ కింద ఇస్తున్నారు.
సామాన్య భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించాలనే సంకల్పంతో.. టీటీడీ అందరికీ ఉచిత లడ్డూ ప్రసాద వితరణ మొదలు పెట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన రోజు వైకుంఠ ఏకాదశినాడు అమలు చేయనుంది టీటీడీ. నెలకు 24 లక్షల లడ్డూలను భక్తులకు పూర్తి ఉచితంగా అందించనున్నారు. అదనపు లడ్డూ కావాల్సిన భక్తులు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా నేరుగా లడ్డూ కాంప్లెక్స్‌లో పొందే సౌలభ్యం కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com