తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం

X
By - TV5 Telugu |31 Dec 2019 12:46 PM IST
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జనవరి 6న వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేశారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, ముక్కోటి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది.
వేకువజామున సుప్రభాత సేవ అనంతరం మూలవిరాట్‌ను పట్టు పరదాలతో పూర్తిగా కప్పేసి.. ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజపాత్రలను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రపరిచారు. ఆలయ శుద్ధి తర్వాత నామపు కొమ్ము, శ్రీచూర్ణం, పచ్చకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గుడ్డలతో శాస్త్రోక్తంగా తయారు చేసిన సుగంధ పరిమళం అనే ద్రవ్యాలతో గోడపై పూతగా పూసి.. శ్రీవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com