మున్సిపల్ ఎన్నికలు.. గులాబీ బాస్ ను కార్నర్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు


మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల కసరత్తు మొదలు పెట్టారు టీ కాంగ్రెస్ నేతలు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసిన పిసిసి... సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతి ద్వారా అభ్యర్థుల్ని డిసైడ్ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ధీటుగా తమ అభ్యర్థులు ఉండేట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆర్థికంగా,సామాజికంగా బలమైన అభ్యర్దులుగా ఉంటడంతో పాటు పార్టీ వీర విధేయతకు పెద్దపీఠ వేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు మరి కోద్దిరోజుల గడువు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక కసతర్తుకు మరింత సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు హస్తం నేతలు. ఇందులో బాగంగా పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా అన్ని మున్సిపాలిటీలు,కార్పోరేషన్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు ఆ పార్టీ ముఖ్యనేతలు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో బీసీలకు యాబైశాతం సీట్లివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీసీలపై చిత్త శుద్ధి ఉంటే కేసీఆర్ కూడా యాభైశాతం సీట్లివ్వాలని గులాబీ బాస్ ను కార్నర్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉండడంతో... రెండు పార్టీల పైన అలర్ట్ గా ఉన్నారు హస్తం పార్టీ నేతలు. బిజెపి టిఆర్ఎస్ మధ్య నడుస్తున్న వార్ కేవలం డూప్ ఫైటేనని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బిజెపి టిఆర్ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టు వ్యవహరిన్నాయని.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బిజెపికి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టే నని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.
కేసీఆర్ సర్కార్ మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు నిధుల మంజూరు పై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఈ అంశాన్ని మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి బలంగా జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు స్థానిక సమస్యల్ని మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పన పై స్థానికంగా ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయాలని స్థానిక నేతలకు రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

