మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

peddireddy-ramachandrareddy

గతంలో 3 కాకపోతే.. 33 రాజధానులు పెట్టుకుంటామంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులకు భూమిని తిరిగిస్తామని... మంచి ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు. అమరావతి కోసం ల్యాండ్‌పూలింగ్ విధానంలో గత ప్రభుత్వం భూములు సేకరించిందని.. ఇప్పుడు అదే విధానంలో వారికి భూములు ఇవ్వొచ్చన్నారు. ఇప్పటికిప్పుడు అమరావతి రైతులతో మాట్లాడాల్సిన పని లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

గతంలో రాజధాని వికేంద్రీకరణతోనే అభివృద్ధి అన్న మంత్రి పెద్దిరెడ్డి.. ఇప్పుడు రాయలసీమకు కావాల్సింది సచివాలయం కాదని.. ముడుపుటలా తాగు, సాగు నీళ్లు మాత్రమే అన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా రాయలసీమకు వచ్చే ఇబ్బంది ఏమి లేదన్నారు.

పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై విపక్షాలు, రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజధానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే.. మళ్లీ ఇలాంటి గందరగోళ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story