హైదరాబాద్‌లో పలు చోట్ల కురిసిన వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల కురిసిన వర్షం
X

rains

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, బేగంపేట్, పారడైస్‌,రాణిగంజ్‌, చిలకలగూడతో పాటు పలు ఏరియాల్లో వర్షం పడింది. అకాల వర్షంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రద్దీ ప్రాంతాల్లో వాన పడడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి పొగమంచు కురుస్తోంది. చలితో నగరవాసులు గజగజ వణుకుతున్నారు. దీనికితోడు ఇప్పుడు వర్షం పడడం ప్రజల్లో మరింత వణుకుపుట్టిస్తోంది. ఐతే హైదరాబాద్‌లో కొన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

Tags

Next Story