నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు తీపి కబురు.. ఆర్బీఐ ఉద్యోగ ప్రకటన

నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు తీపి కబురు.. ఆర్బీఐ ఉద్యోగ ప్రకటన

RBI

దేశంలోనే అత్యున్నత బ్యాంక్ ఆర్బీఐ నిరుద్యోగులకు నూతన సంవత్సరానికి శుభవార్తతో స్వాగతం పలుకుతుంది. 926 అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో పాస్ అయినవారు అప్లై చేసుకోవచ్చ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మార్కులతో సంబందం లేకుండా డిగ్రీ పూర్తిచేస్తే సరిపోతుంది. డిసెంబరు 1, 2019 నాటికి 20- 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌కు రూ.50. చెల్లించి అప్లై చేసుకోవచ్చు. మిగిలిన అభ్యర్థులకు రూ.450 అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది జనవరి 16. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఉంటుంది. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ మార్చిలో ఉంటుంది. తరువాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, చీరాల, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ లో పరిక్ష నిర్వహిస్తున్నారు. www.rbi.org.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

వారానికి అయిదు పని దినాలు, తక్కువ పనివేళలు, ఒత్తిడి లేని విధులు ఆర్‌బీఐ ప్రత్యేకత. అసిస్టెంట్‌ ఉద్యోగానికి 36,000 తో జీతం ప్రారంభమవుతోంది. మూడేళ్ల అనుభవం తర్వాత డిపార్ట్ మెంట్ ఎగ్జామ్స్ రాసి గ్రేడ్‌ ఎ, అనంతరం గ్రేడ్‌ బి స్థాయిని అందుకోవచ్చు.

పరీక్ష విధానం:

ప్రిలిమ్స్ ఎగ్జామ్:

ఈ పరీక్షను వంద మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కుగా కేటాయించారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30, న్యూమరికల్‌ ఎబిలిటీలో 35, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలుగా మొత్తం వంద ప్రశ్నలను మూడు భాగాలుగా విభజిస్తారు. వంద ప్రశ్నలకు గంట సమయం కేటాయించారు. ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇందులో అర్హత సాధించినవారికి మెయిన్స్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది.

మెయిన్స్ ఎగ్జామ్:

మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ మెుత్తం 5 విభాగాలుగా కేటాయించారు. రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ల్లో ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మెయిన్స్ లో కూడా విభాగాల వారీగా ప్రశ్నలతో పాటు సమయం కూడా కేటాయించారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగానికి 25 నిమిషాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు 20 నిమిషాలు ఉన్నాయి. రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీలకు 30 నిమిషాల చొప్పున కేటాయించారు. మొత్తం పరీక్ష వ్యవధి 135 నిమిషాలు.

ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఎగ్జామ్ ఉంటుంది.

లాంగ్వేజ్‌ స్కిల్ టెస్ట్‌ :

మెయిన్స్‌లో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్‌ స్కిల్ టెస్ట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాలి. హైదరాబాద్‌లోని 25 ఖాళీలకు మాత్రమే తెలుగు భాష పరీక్ష రాసే అవకాశం ఉంది. ముంబయి కార్యాలయంలో 419 ఖాళీలు ఉన్నాయి. వీటికి పోటీ పడడానికి మరాఠీ లేదా కొంకణి భాషలో ఉత్తీర్ణత తప్పనిసరి.

Tags

Next Story