కదిరి ఎమ్మెల్యేపై అనంతపురం టీడీపీ ఇన్‌చార్జి ఆరోపణలు

రాష్ట్రంలో అభివృద్ధి పనులు తిరోగమనంలో ఉన్నాయన్నారు అనంతపురం జిల్లా కదిరి టీడీపీ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్. కదిరి ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధారెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకుని రాలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులకే శంకుస్థాపనలను చేస్తున్నారని వెంటకప్రసాద్ అన్నారు. టీడీపీ హయాంలో విడుదలైన జీవోలను చూపిస్తూ.. ఇది అబద్ధమని నిరూపించుకోవాలని.. ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కందికుంట సవాల్ విసిరారు. కాంట్రాక్టులన్నీ.. తన కుటుంబ సభ్యులతో నిర్వహిస్తున్నారని.. వెంకటప్రసాద్ ఆరోపించారు.
Next Story