న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రఖ్యాత నుమాయిస్‌ ప్రారంభం

న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రఖ్యాత నుమాయిస్‌ ప్రారంభం

numaise

హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రఖ్యాత నుమాయిస్‌ ప్రారంభమైంది. 80వ ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను మంత్రులు మహ్మద్‌ ఆలీ, తలసాని, ఈటెల ప్రారంభించారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు మొత్తం 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్‌ ఉంటుంది. ఈ నుమాయిష్‌ సందర్భంగా రాత్రి 11.30 వరకు ట్రైన్లను కొనసాగించాలని మెట్రో నిర్ణయించింది..

మరోవైపు గతేడాది జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 3 కోట్ల రూపాయలతో 2 కిలోమీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌లో ఫైర్‌ సేఫ్టీ కేబుల్స్‌, ఫైర్‌ ఇంజన్లను సిద్ధం చేశారు. నుమాయిష్‌ నుండి వచ్చే ఆదాయంలో తెలంగాణలోని 18 విద్యాసంస్థల్లో 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందిస్తున్నారు నిర్వాహకులు

Tags

Read MoreRead Less
Next Story