న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. గోవాలో ముగ్గురు తెలుగువారు మృతి

న్యూ ఇయర్ సంబరం కాస్త విషాదం మారింది. గోవాలో జరిగిన సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్-EDM ఫెస్టివల్‌లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. టికెట్ల కోసం క్యూలో నిల్చుని.. అలాగే కుప్పకూలిపోయాడు. అతడిని హైదరాబాద్‌కు చెందిన కోట ఫణిదీప్‌గా గుర్తించారు. దీంతో.. సన్‌బర్న్ EDM ఫెస్టివల్ ముగ్గురు తెలుగువాళ్లను బలి తీసుకున్నట్టు అయింది.
ఇదే వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన హైదరాబాదీ సాయిప్రసాద్, విశాఖ పెందుర్తికి చెందిన చిన్ని వెంకట్ కూడా తొక్కిసలాటలో మృతి చెందారు. వాళ్ల మరణాలపైనా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. స్టేడియానికి పెద్దసంఖ్యలో వీక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగిందని.. బారికేడ్లు మీద పడటంతో.. పక్కటెముకలు విరిగి.. అంతర్గత రక్తస్రావం కారణంగా వెంకట్ మరణించినట్టు అతని బంధువులు చెప్తున్నారు. ఆ విషాదం మరిచిపోకముందే మరో యువకుడు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. బెంగళూరులో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఫణిదీప్.. స్నేహితులతో కలిసి వెగటూర్ బీచ్‌లో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లాడు. డ్రగ్స్ తీసుకున్నాడా.. ఓవర్‌డోస్ అయిందా.. తలకు బలమైన గాయం కావడంతో మరణించాడా.. అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com