Home
 / 
అంతర్జాతీయం / కెనడాలో ఘోర రైలు...

కెనడాలో ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి

కెనడాలో ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి
X

canada

కెనడాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మనిటోబా ప్రావిన్స్‌లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 13 మంది మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో 8 మంది ప్రయాణికులు కాగా, మిగతా వారు రైల్వే సిబ్బంది. ప్రమాదం జరిగిన పోర్టిగాలా ప్రైరీ వద్దకు చేరుకున్న సహాయ బృందాలు క్షతగాత్రులకు వైద్యసేవలు అందించాయి. అలాగే భారీ క్రేన్ల సాయంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణాలేంటనే దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. కెనడా రవాణా భద్రత బోర్డు ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అటు, గాయపడ్డవారి క్షేమ సమాచారాలు బంధువులకు తెలియ చేసేందుకు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

Next Story