ఆంధ్రప్రదేశ్

సతీమణితో కలిసి అమరావతి పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు

సతీమణితో కలిసి అమరావతి పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు
X

babu

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి అమరావతి ప్రాంత పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈసారి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమరావతికి వెళుతున్నారు. రైతులకు సంఘీభావంగా బుధవారం రైతుల మధ్య ఉండాలని.. వారికి అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో చంద్రబాబు దంపతులు పర్యటిస్తారు. ధర్నాలోనూ పాల్గొంటారు.

ఇటు టీడీపీ న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. ఎవరూ బొకేలు, కేక్‌లు తీసుకురావొద్దని అధినేత కోరారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఖర్చు చేసే డబ్బును అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. అమరావతి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని.. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES