మా సీఎం ఎప్పటికీ కేసీఆరే : మంత్రి కేటీఆర్

మా సీఎం ఎప్పటికీ కేసీఆరే : మంత్రి కేటీఆర్

kcr-and-ktr

తెలంగాణకు తాను ఇప్పుడే సీఎం కాబోనని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తమ సీఎం ఎప్పటికీ కేసీఆరే అని స్పష్టం చేశారు. కొత్త ఏడాది సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్‌.. అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 లో తమకు శుభారంభం లభించిందని.. 2020లో కూడా మంచి ఆరంభమే లభిస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది తమకు మున్సిపాల్టీలతోనే శుభారంభం లభిస్తుందని చెప్పారు. 2019లో పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యిందని... గతంలో ఎన్నడూ లేనంతగా... 60 లక్షల సభ్యత్వం చేశామన్నారు. రాబోయే 11 నెలలు పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తామన్నారు.

2020 లో కొత్త శకం ఆరంభమవుతుందని కేటీఆర్‌ అన్నారు. ఈ దశకం తెలంగాణదే కావాలని... దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రశ్రేణిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల మీద ఫీడ్‌బ్యాక్‌ తెప్పించామని... అన్నిచోట్ల పోటీ చాలా ఎక్కువగా ఉందన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అవినీతి రహిత చట్టంగా రూపొందించామని.. దీని ప్రకారం 21 రోజుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి లభిస్తుందని... ఒకవేళ అధికారులు అనుమతి ఇవ్వకపోతే... ఆటోమెటిక్‌గా అనుమతి ఇచ్చినట్లే భావిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story