భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్‌ ముకుంద్ నరవానే

భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్‌ ముకుంద్ నరవానే

army-c

భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్‌ ముకుంద్ నరవానే బాధ్యతలు స్వీకరించారు. దేశ రక్షణ విషయంలో ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన సన్నద్ధతతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. శిక్షణా కార్యక్రమాలతోపాటు క్షేత్రస్థాయి రక్షణలోనూ సైన్యాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దుతామన్నారు. భారత్ ఆర్మీ 28వ చీఫ్ జనరల్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టిన నరవానే.. బుధవారం వార్ మెమోరియల్‌కి వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. దేశానికి ఏ ముప్పూ లేకుండా చూస్తామన్నారు. పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదానికి సమాధానం చెప్పేందుకు చాలా మార్గాలున్నాయన్న నరవానే.. ఉగ్రవాదాన్ని ఆపకుంటే.. టెర్రర్‌ క్యాంపులపై దాడి చేసే అధికారం తమకుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story