2020ని స్వాగతిస్తూ.. సంబరాల్లో మునిగితేలిన దేశప్రజలు

2020ని స్వాగతిస్తూ.. సంబరాల్లో మునిగితేలిన దేశప్రజలు

mumbai-celb

దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర న్యూఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి. వేలాదిగా గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గరకు చేరుకున్న నగరవాసులు... అర్థరాత్రి 12 కాగానే ఒకరికొకరు హ్యాపీ న్యూఇయర్‌ చెప్పుకున్నారు. లేజర్‌ షో వెలుగులతో గేట్‌ వే ఆఫ్‌ ఇండియా కలర్‌ ఫుల్‌గా మారింది. బాణాసంచా మోతతో ఆ ప్రాంతం మారుమోగింది.

అటు.. దేశ రాజధాని ఢిల్లీలోనూ 2020కి ఘన స్వాగతం పలికారు నగర వాసులు. ప్రముఖ హోటల్స్‌ నిర్వహించిన వేడుకల్లో ఆడిపాడి సందడి చేశారు. మ్యూజికల్‌ షోలు అలరించాయి. పార్టీలు చేసుకుంటూ ప్రజలు ఎంజాయ్‌ చేశారు.

ఇక బెంగళూరు, కోల్‌కతాలోనూ పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చారు. బెంగళూరు, కోల్‌కతా వీధులు న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌తో రద్దీగా మారాయి. హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ కేరింతలు కొడుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కూడా న్యూ ఇయర్‌ జోష్‌ నెలకొంది. పాటలకు స్టెప్పులేస్తూ కొరింతలు కొడుతూ కుర్రకారు సందడి చేసింది. అటు కేరళ రాజధాని త్రివేండ్రంలోనూ సంబరాలు అంబరాన్నంటాయి.

ఎప్పుడు దేశ భద్రత చూసుకుంటూ కంటిమీద కునుకు లేకుండా ఉండే భారత జవాన్లు కూడా న్యూ ఇయర్‌ సంబరాల్లో మునిగిపోయారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు నృత్యాలు చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నారు.

నాగ్‌పూర్‌, అమృత్‌సర్‌, మొరదాబాద్‌, లక్నోతో పాటు పలు మెట్రో నగరాల్లో న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story