తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు
ఆకాశన్నంటే సంబరంతో నూతన ఏడాదికి ఘన స్వాగం పలికాయి తెలుగు రాష్ట్రాలు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు అదరహో అనిపించాయి. సాయంత్రం ప్రారంభమైన సెలబ్రేషన్స్.. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగాయి. డాన్సులు, కేరింతలతో కుర్రకారు హోరెత్తించింది.
హైదరాబాద్ యువత న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలింది. మ్యూజికల్ నైట్స్, నైట్ పార్టీలతో ఎంజాయ్ చేశారు. పలు సంస్థలు నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్‌లో డాన్సులతో యువత సందడి చేసింది. సరిగ్గా అర్థరాత్రి 12 కాగానే రోడ్లపైకి వచ్చిన యువత.. కేరింతలు కొడుతూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.
న్యూ ఇయర్ ఈవెంట్స్‌తో హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్ సందడిగా మారాయి. ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసిన లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గతంలో కంటే ఈసారి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు హోటల్స్ నిర్వహకులు.
హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు న్యూ ఇయర్ మానియాతో ఊగిపోయాయి. విశాఖ సాగర తీరం కూడా న్యూ ఇయర్ జోష్ నెలకొంది. బీచ్ రోడ్ నగర వాసులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోనే అంత్యంత ఎత్తైన భవనంగా పేరు పొందిచిన లాన్సమ్ టవర్స్‌లో తొలిసారి న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు.
విజయవాడ, తిరుపతి, వరంగల్, రాజమండ్రితో పాటు పలు నగరాలు 2020కి ఘన స్వాగతం పలికాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీతానికి తగిన స్టెప్పులతో హోరెత్తించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుకలు జోష్ నింపాయి. కొత్త ఏడాదిలో తెలుగు ప్రజలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని మనమూ కోరుకుందాం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com