క్రైమ్

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి..

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి..
X

accident

చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం సిద్ధేశ్వరకొండపై ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. దిగువ మోదులపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది ట్రాక్టర్‌పై సిద్ధేశ్వరకొండపైనున్న సిద్ధేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా ఘాట్‌రోడ్డులో ట్రాక్టర్‌ ఒక్కసారిగా సమీపంలోని గుంతలో బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న ఇద్దరు మహిళలతో పాటు ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story

RELATED STORIES