రాజధాని పర్యటనకు వస్తే పవన్ కళ్యాణ్‌ను అడ్డుకుంటారా? : చంద్రబాబు
వారం రోజులుపైగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు.. భార్య భువనేశ్వరితో కలిసి రాజధానిలో పర్యటించిన ఆయన మందడం రైతులకు భరోసా ఇచ్చారు. జై అమరావతి అంటూ ప్రసంగించిన ఆయన.. కొత్త సంవత్సరం రోజున ఆడపడుచులంతా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కలిసి ఐక్యంగా పోరాడితే.. అమరావతిని ఏ శక్తి తరలించలేదని చంద్రబాబు ధైర్యం చెప్పారు..
మాట తప్పను మడప తిప్పను అనే జగన్?.. గతంలో అసెంబ్లీ వేదికగా అమరావతి రాజధానిని ఆమోదించారని.. ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారని ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వం కట్టిన సచివాలయంలోనే ఇప్పుడు జగన్ పరిపాలిస్తున్నారని గుర్తు చేశారు. అసెంబ్లీని కేవలం 120 రోజుల్లోనే నిర్మించామన్నారు చంద్రబాబు. కేవలం తనను తిట్టడమే జగన్ పనిగా పెట్టుకున్నారని, కనీసం సభ్యత సంస్కరం లేదా అని ప్రశ్నించారు..
రాజధాని పర్యటనకు వస్తే పవన్ కళ్యాణ్‌ను అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కాన్వాయ్‌కు మరో దారే లేదా అని నిలదీశారు. జగన్ ఏమైనా ఆకాశం నుంచి ఊడి పడ్డారా చంద్రబాబు ప్రశ్నించారు. రైతులను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com