పది, ఇంటర్ విద్యార్ధులకు సీబీఎస్ఈ బోర్డ్ షాక్..

పదవతరగతి, ప్లస్ ఒన్, ప్లస్ టూ చదువుతున్న విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాయాలంటే హాజరు శాతం 75% కచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది. బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాజరు తగ్గడానికి సరైన కారణాలు వివరిస్తూ సంబంధిత పత్రాలను జనవరి 7లోగా ప్రాంతీయ కార్యాలయాల్లో సమర్పించాలని సీబీఎస్ఈ బోర్డు ఆదేశించింది. 2019లో హాజరు శాతం తక్కువగా నమోదైన విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్, లీస్ట్ స్కోర్ తెచ్చుకున్నట్లు గణాంకాలు నమోదైనట్లు తెలుస్తోంది. అందుకే దీనిని సరిదిద్దడానికి అన్ని స్కూళ్లు ఖచ్చితంగా 75% హాజరు ఉన్న విద్యార్ధులనే పరీక్షలకు అనుమతించాలని బోర్డు తెలిపింది. బలమైన కారణం ఉంటే అందుకు సంబంధించిన రిపోర్టులను జత చేస్తూ బోర్డుకు లెటర్ రాయాల్సి ఉంటుంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com