ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేశాడని.. బైక్‌ను తగలబెట్టుకున్న యువకుడు

By - TV5 Telugu |2 Jan 2020 6:52 AM GMT
ఇంట్లో ఎలుక దూరిందని.. ఓ ప్రబుద్ధుడు ఇంటినే కాల్చేసుకున్నాడట. ఈ యువకుడి వ్యవహారం అలాగే వుంది. ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేశాడని.. ఏకంగా తన బైకునే తగలబెట్టుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని సావిత్రి ఏరియాలో జరిగిందీ సంఘటన. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ యువకుడికి ట్రాఫిక్ పోలీస్ ఛలాన్ రాశాడు. అంతేకాదు, బైకును కూడా స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు.. ట్రాఫిక్ పోలీస్ తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో తన మోటార్ సైకిల్ కే నిప్పంటించాడు. దీంతో బైకు రోడ్డుపైనే క్షణాల్లో మంటల్లో మాడి మసైపోయింది. బైకును కాల్చేసిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com