తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల మధ్య మళ్లీ విభేదాలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల మధ్య మళ్లీ విభేదాలు

Screenshot_1

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి. రమణ దీక్షితుల రీ ఎంట్రీతో అర్చకుల మధ్య అగ్గి రాజుకుంది. శ్రీవారి సన్నిధిలోకి రమణ దీక్షితులు వచ్చారు. వచ్చేటప్పుడు ఆయన నెయ్యి తీసుకువచ్చారు. శ్రీవారి సన్నిధిలోని దీపంలో నెయ్యి పోయడానికి ప్రయత్నించారు. ఇది చూసి ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి సన్నిధిలోకి నెయ్యి తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని సూచించారు. దీపంలో నెయ్యి పోయడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమం లో రమణ దీక్షితులు, వేణుగోపాల దీక్షితుల మధ్య మాటా మాట పెరిగింది. ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో రమణ దీక్షితులు కో పం పట్టలేకపోయారు. నీ కథను అధికారుల వద్దే తేల్చుకుంటా అంటూ శ్రీవారి సన్నిధి నుంచి బయటకు వచ్చేశారు.

Tags

Read MoreRead Less
Next Story