టీ-సేవా సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం..

టీ-సేవా సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం..

tseva

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-సేవా సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటే ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ఎ. వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెంటర్ల ద్వారా బిల్లుల చెల్లింపు, బస్సు, రైలు, విమానం, టికెట్ల రిజర్వేషన్, పాన్ కార్డు దరఖాస్తు, బ్యాంకు లావాదేవీలు, నగదు చెల్లింపులు, టెలికం, పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ తదితర సేవలను టీ-సేవా కేంద్రాల ద్వారా పొందొచ్చన్నారు. సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటే ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 10 లోపు ఆన్‌లైన్‌లో www.tsevacentre.com లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 81799 55744.

Read MoreRead Less
Next Story