ఘనంగా ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్‌ అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవం

ఘనంగా ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్‌ అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవం

arunsagar

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్‌ అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరిగింది. టీవీ 5 రిపోర్టర్‌ ప్రముఖ కవి ప్రసేన్‌కు ఈ ఏడాది విశిష్ట సాహిత్య పురస్కారం అందించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. శ్రీనివాస్‌కు విశిష్ట పాత్రికేయ అవార్డు అందించారు. అరుణ్‌సాగర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా... ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, టీవీ 5 ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. సీనియర్‌ జర్నలిస్టులు, విఖ్యాత రచయితలు.. అరుణ్‌ సాగర్‌ అభిమానులు హాజరయ్యారు.

అరుణ్‌ సాగర్‌ మామూలు వ్యక్తి కాదని.. ఓ మహా మేధావి అని టీవీ 5 ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కొనియాడారు. ఆయనతో కొద్ది కాలం పాటు మాత్రమే పనిచేసినా.. అనేక విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. అరుణ్‌సాగర్‌ మీద ఉన్న గౌరవంతోనే తాను ఈ సభకు హాజరైనట్లు బీఆర్‌ నాయుడు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story