జనవరిలో ఎన్ని సెలవులో.. బ్యాంకులకు భయ్యా..

కొత్త ఏడాది మొదటి నెలలోనే సందడి చేయడానికి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. సంబరాలు చేసుకోవడానికి సెలవులనూ తెస్తుంది. సంక్రాంతితో పాటు మరి కొన్ని సెలవులు కూడా ఉంటున్నాయి ఈ నెలలో. మరి ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.. జనవరి నెలలో బ్యాంకులకు మొత్తం 16 రోజులు సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ రాష్ట్రాల ప్రాతిపదికన బ్యాంకులకు సెలవులను ప్రకటించింది. సెలవులు రాష్ట్రాల ప్రాతిపదికన, బ్యాంకుల ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. ఆదివారాలు పని చేయవు.. రెండు, నాలుగు శనివారాల్లో పనిచేయవు. అలా చూసుకుంటే అన్నీ కలుపుని ఈ నెలలో 16 సెలవు దినాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా జనవరి నెలలో బ్యాంక్ సెలవులు..
జనవరి 1 కొత్త సంవత్సరం (చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు), జనవరి 2 గురుగోవింద్ సింగ్ జయంతి (చాలా రాష్ట్రాల్లో హాలిడే), జనవరి 5 ఆదివారం , జనవరి 7 ఇమోయిను ఇరత్పా (ఇంఫాల్), జనవరి 8 గాన్‌ఘాయి (ఇంఫాల్), జనవరి 11 రెండో శనివారం, జనవరి 12 ఆదివారం, జనవరి 14 మకర సంక్రాంతి (అహ్మదాబాద్‌లో సెలవు), జనవరి 15 ఉత్తరాయణ మకర సంక్రాంతి (చెన్న, గౌహతి, హైదరాబాద్, అమరావతి తదితర ప్రాంతాల్లో సెలవు. జనవరి 16.. తిరువల్లూర్ డే (చెన్నై), జనవరి 17 ఉజావర్ తిరునాల్ సెలబ్రేషన్స్ (చెన్నై), జనవరి 19 ఆదివారం , జనవరి 23.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (కోల్‌కతా, అగర్తల), జనవరి 25 నాలుగో శనివారం.. జనవరి 26 ఆదివారం.. జనవరి 30 సరస్వతీ పూజ, వసంత పంచమి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com