'మా' గొడవ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఫైర్..

మా గొడవ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఫైర్..

chiru,-rajsekhar

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఇండస్ట్రీ అంతా ఓ కుటుంబం అంటారు. చిన్న విష విషయాలనే చిలువలు పలువలు చేస్తూ చీప్‌గా ప్రవర్తిస్తుంటారు.. తెర మీద హీరోలు.. ఇక్కడ మాత్రం కామెడీ యాక్టర్లైపోయి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. తాజాగా మరో గొడవ తెరపైకి వచ్చింది. కొత్త సంవత్సరంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్క్ హయత్‌లో నిర్వహించింది మా అసోసియేషన్.

కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి మా గొడవలను సాల్వ్ చేశారు. గొడవలు సద్దుమణిగాయి కదా అనుకుంటే మరోసారి యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ ఇన్నాళ్లూ తన మనసులో దాచుకున్నవన్నీ వెళ్లగక్కారు. దీంతో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. చిరంజీవి మాట్లాడుతున్నంత సేపు పలు మార్లు అడ్డుపడ్డ రాజశేఖర్ మా కారణంగానే తన ఫ్యామిలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయంటూ సంచలన కామెంట్ చేశారు.

తన కారు ప్రమాదానికి గురి కావడం కూడా మా వివాదాలే కారణమన్నారు. మోహన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి పెద్దలు ఆయన ప్రసంగాన్ని ఆపే ప్రయత్నం చేసినా అవేమీ వినిపించుకోకుండా ఆయన చెప్పాలనుకున్నవి చెప్పేసాడు. అయితే రాజశేఖర్ వ్యాఖ్యలని తప్పుపట్టిన చిరంజీవి, మాలో ఉన్న గొడవల గురించి వేదిక మీద మాట్లాడొద్దని చెప్పినప్పటికీ వినకుండా రాజశేఖర్ తప్పుడు వ్యాఖ్యలు చేసి కార్యక్రమాన్ని రసాభాసగా మార్చారు. రాజశేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చిరు కమిటీకి సూచించారు.

Read MoreRead Less
Next Story