గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ

cm-jagan-and-governer

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఇద్దరి సమావేశం జరిగింది. మూడు రాజధానులు రావొచ్చంటూ... అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేసిన తర్వాత... గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి. ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్‌రావు కమిటీ నివేదిక, ఇటీవలె నియమించిన హైపవర్ కమిటీ తదితర అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రాజధాని మార్పుపై బిశ్వభూషణ్‌తో చర్చించనున్నట్టు సమాచారం.

Tags

Next Story