మూడు రాజధానులు వద్దు అంటూ కాకినాడలో వినూత్న నిరసన

మూడు రాజధానులు వద్దు అంటూ కాకినాడలో వినూత్న నిరసన

kakinada

మూడు రాజధానులు వద్దు... ఒక్క రాజధాని ముద్దు అంటూ.. .తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వినూత్న నిరసన చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంద్రాపాలెం లాకుల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని... అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ మౌన ప్రదర్శనలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, జనసేన, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అధికార వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చినరాజప్ప ఆరోపించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 4న బాలాజీ సెంటర్‌లో వంటావార్పు నిర్వహిస్తామన్నారు.

Tags

Next Story