నూతన సంవత్సర వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం

నూతన సంవత్సర వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం

krl-news

కర్నూలు జిల్లా మహానంది మండలం ఈశ్వర్‌ నగర్‌లో నూతన సంవత్సర వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం చేశారు కొందరు దుండగులు.. పాత కక్షల నేపథ్యంలో ఎరకలి ఉపేంద్ర అతని అన్న రాజశేఖర్‌, నాగర్జునలపై కత్తులతో దాడి చేశారు. వారు తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంబడించి మరీ దాడి చేశారు. ఎరుకలి ఉపేంద్ర అక్కడిక్కడే మృతి చెందగా.. గాయపడ్డ రాజశేఖర్‌, నాగర్జునలకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story