స్టెప్పులతో అదరగొట్టిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి

X

ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్టెప్పులతో అదరగొట్టారు. కుర్రాళ్లకు పోటీ ఇస్తూ న్యూ ఇయర్ వేడుకల్లో అభిమానులు, కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసి అందర్నీ ఉత్సాహపరిచారు. కుర్రాళ్లకు తానూ పోటీ అన్న రేంజ్లో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియలో వైరల్ అయ్యింది.
న్యూ ఇయర్ సందర్భంగా ఒంగోలులో ఎంపీ ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేశారు. మాగుంట అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎంపీ కూడా వేదికపైకి రాగా.. పార్టీ కార్యకర్తలు డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. తర్వాత ఎంపీని కూడా డ్యాన్స్ చేయాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేశారు. దీంతో ఆయన కూడా సై అన్నారు. అందరూ కలిసి సరదాగా హీరో మహేష్‌బాబు పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
