ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం

delhi-fire

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పీరాగర్హీ ఏరియాలోని ఓ బ్యాటరీ ఫ్యాకర్టీలో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు లీక్‌ అవ్వడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పేలుడు దాటికి ఫ్యాక్టరీ గోడలు ధ్వంసమయ్యాయి. దాదాపు 35 ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story